స్వర్గీయ మొగిలయ్య శెట్టి నాటక రంగంలో నవరస నటనా చక్రవర్తిగా కీర్తి పొందారు సంస్మరణ కృషి సభలో పలువురు వెల్లడి.

చిత్తూరు ఫిబ్రవరి 8: మన న్యూస్

చిత్తూరు లోని స్థానిక నాయుడు బిల్డింగ్స్ విజయం విద్యా సంస్థల ఆవరణంలో ప్రముఖ నాటక రచయిత, నటుడు, గాయకులు స్వర్గీయ శ్రీ.సి. మొగిలయ్య శెట్టి గారి సంస్మరణ సభ శనివారం ఉదయం 10:30 గంటలకు మన సంస్కృతి కళా సంస్థ అధ్యక్షులు సహదేవ నాయుడు ఆధ్వర్యంలో అధ్యక్షతన జరిగింది. పౌరాణిక ,చారిత్రక, సాంఘిక, దేశభక్తి నాటక రంగాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.ముఖ్య అతిధి శ్రీ వరసిద్ధి కళాక్షేత్రం ప్రధాన కార్యదర్శి పాడి రమేష్ బాబు మాట్లాడుతూ మొగిలయ్య శెట్టి నాటక కళా రంగానికి అంకితమై నాటక రచయితగా,నటుడిగా నటిస్తూ , పద్యాలు, గేయాలు పాడుతూ నాటక రంగాన్ని బతికించడంలోను, నాటక కళాకారులను ప్రోత్సహించడంలో వీరి సేవలు మరువలేవని తెలిపారు.అనంతరం ప్రముఖ కవి డాక్టర్ వల్లేరుహరి నాయుడు మాట్లాడుతూ వీరు పుస్తకాలు, నాటకాలు రాసి రచయితగాను, గేయాలు ,భక్తి గీతాలు రాసి సొంతంగా పాడి గాయకుడుగాను రాణించారని తెలిపారు.ఆత్మీయ అతిథి రచయిత్రి వి. శ్యామలాదేవి, వీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు మరియు పిల్లల చేత పౌరాణిక, దేశభక్తి నాటకాలు వేయించేవారని*ఆయన ప్రోత్సాహముతో నేను నాటకాలలో నటించానని అనుభవాలు తెలిపారు. అతిథి ప్రముఖ కవి. మునిస్వామి మాట్లాడుతూ నా రచనలను ,సాహిత్యాన్ని ప్రోత్సహించడం లో ముందుంటారని నాకు “మహాకవి” బిరుదును ఇచ్చి గౌరవించిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేశారు. విశిష్ట అతిథి ప్రముఖ రచయిత్రి యం.ఆర్ .అరుణ కుమారి మాట్లాడుతూ ఇటు అధ్యాపక వృత్తికి న్యాయం చేస్తూ అటు నాటక రచయితగా నటుడుగా గాయకుడుగా రాణించిన నవరస నటనాచక్రవర్తి” గా కీర్తి పొందారని తెలిపారు.అనంతరం రామచంద్ర మిషన్ ప్రశక్షికలు నాగరాజు మాట్లాడుతూ మాది చిన్ననాటి స్నేహబంధమని, వీరికి దైవభక్తి ఎక్కువ అందువలన కీర్తనలు, భక్తిపాటలు,గేయాల పాడడం లో దిట్ట అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలకట రెడ్డప్ప , శిఖండి సినిమా హీరో కోడి కిషోర్ ,పార్థసారధి నాయుడు, పాకాల రాజగోపాల్, రాధ, చంద్రశేఖర్, సునందన్ రెడ్డి ,కృష్ణంరాజు, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, మనోహర్, అనంత కుమార్, జీను రాజశేఖర్, మిట్ట మహేంద్ర,రంగనాథం విజయ. ఆనంద నాయుడు ,కుటుంబ సభ్యులు, బంధువులు మరియు కవులు, కళాకారులు, గాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

  • Related Posts

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    చిత్తూరు మన ధ్యాస సెప్టెంబర్-13: ఈరోజు ఉదయం 10 గంటలకు ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖ కార్యాలయంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “ఉపాధ్యాయులందరూ డాక్టర్ సర్వేపల్లి…

    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ, జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు గారు తెలిపారు. ఆయన శనివారం ప్రకాశం జిల్లా 39వ కలెక్టర్‌గా బాధ్యతలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    • By JALAIAH
    • September 14, 2025
    • 2 views
    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

    • By JALAIAH
    • September 14, 2025
    • 3 views
    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

    నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జనసేన నేత బుజ్జి…

    నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జనసేన నేత బుజ్జి…

    బాల వికాస్ కేంద్రాల ద్వారా విలువలతో కూడిన విద్య – ఊరిమిండి వెంగలరెడ్డి

    • By JALAIAH
    • September 14, 2025
    • 4 views
    బాల వికాస్ కేంద్రాల ద్వారా విలువలతో కూడిన విద్య – ఊరిమిండి వెంగలరెడ్డి

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక