తెలుగు సినిమా పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్న ఫిల్మ్ చాంబర్

Mana News :- ఫిబ్రవరి 6.. తెలుగు సినిమా పుట్టిన రోజుగా చేయాలని నిర్ణయించింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇకపై ప్రతి యేడాది ఈ రోజును తెలుగు సినిమా పుట్టిన రోజుగా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అందించే అవార్డులతో పాటు, ఛాంబర్ తరఫు నుంచి వివిధ కేటగిరీల్లో అవార్డులు కూడా అందించాలనే నిర్ణయం జరిగింది. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడు ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని నిర్ణయం జరిగింది. ఈ జెండా రూపకల్పన బాధ్యతను సీనియర్ రచయిత పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించింది ఫిల్మ్ ఛాంబర్. తొలి తెలుగు టాకీ సినిమాకు సంబంధించి వివరాలను ఎంతో రీసెర్చ్ చేసి భక్త ప్రహ్లాద గురించి తెలిపిన సీనియర్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ కృషిని గుర్తు చేసుకుంటూ.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ ఆధ్వర్యంలో ఇదే వేదికపై ఆయన రచించిన ‘మన సినిమా ఫస్ట్ రీల్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇక తెలుగు సినిమా పుట్టిన రోజు సందర్భంగా సీనియర్ రైటర్ పరుచూరు గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఛాంబర్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ..
‘‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున తెలుగు సినిమా దినోత్సవం మొదటిసారి చేయడం జరుగుతుంది. అంతకు ముందు కొన్ని సంస్థలు చేశాయి. ఈయేడాది నుంచి ఛాంబర్ తరఫు నుంచి చేయాలని నిర్ణయించుకున్నాం. సినిమా అనేది మా అందరికీ తల్లి లాంటిది. తెలుగు సినిమా ఛాంబర్ మదర్ బాడీ ఇక నుంచి ప్రతి సంవత్సరం చేయాలని డిసైడ్ చేశాం. మొదటి యేడాది కాబట్టి ఈ సారి నార్మల్ గా చేస్తున్నాం. నెక్ట్స్ ఇయర్ నుంచి గ్రాండ్ గా నిర్వహించబోతున్నాం. పాత తరం కళాకారులకు మరిన్ని సన్మానాలు చేస్తాం. సినిమా హిస్టరీ గురించి చెబితే.. సినిమా అనేది ఫస్ట్. బర్త్ ఆఫ్ సినిమా ముఖ్యం. చాలామంది ఎన్నో చరిత్రలు క్రియేట్ చేశారు. కానీ బర్త్ ఆఫ్ సినిమా అనేది ముఖ్యం. రాబోయే తరాలు కూడా ఇది గుర్తుంచుకోవాలి. జనాలు వస్తుంటారు పోతుంటారు. కానీ పుట్టుక అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకోవాలి. ఇక ఈ రోజును గురించి పాతికేళ్ల పాటు రీసెర్చ్ చేసి మొదటి తెలుగు టాకీ సినిమా డేట్ ను ఖచ్చితంగా గుర్తించి ప్రపంచానికి తెలియజేసిన సీనియర్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను ’’ అన్నారు.
ఛాంబర్ సెక్రెటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ‘‘ఇవాళ సినిమా పుట్టిన రోజు. ఫస్ట్ టాకీ ఫిల్మ్ భక్త ప్రహ్లాద. ఈచిత్రానికి హెచ్ఎమ్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రానికి ముందు వేరే వేరే డేట్ అనుకునేవాళ్లం. రెంటాల జయదేవ్ గారు పరిశీలించి ఈ రోజు అని చెప్పడంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భక్త ప్రహ్లాద కంటే ముందే కాళిదాసు అనే సినిమా 1931లో వచ్చింది. కాళిదాసు చిత్రంలో నాలుగు రీళ్లు తెలుగులోనే పాటలు, డైలాగులు ఉండి.. తెలుగు దర్శకుడు హెచ్ఎమ్ రెడ్డి దర్శకుడు.. తెలుగువాడైన గంగాధర్ హీరోగా నటించారు. తర్వాత మూడు రీళ్లు తమిళ్ లో ఉండటం కనిపిస్తుంది. ఈ కారణంగా కాళిదాసును తమిళ్ వాళ్లు వాళ్ల సినిమాగా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా కాళిదాసు మన తెలుగు సినిమా. ఫస్ట్ హిందీ టాకీ మూవీ ఆలం ఆరా లో మన ఎల్వీ ప్రసాద్ గారు నటించారు. తెలుగు ఫస్ట్ టాకీ భక్త ప్రహ్లాద, తెలుగు, తమిళ్ ఫస్ట్ టాకీ కాళిదాసు.. ఈ మూడు చిత్రాల్లోనూ ఎల్వీ ప్రసాద్ గారు నటించారు. ఆయన ఆ రోజుల్లో మూకీ నుంచి టాకీ వరకూ యాక్ట్ చేసి.. చాలా కష్టపడి.. ఏడు రోజులు భోజనం లేకుండా బ్రతికి ఈ రోజు ఇంత స్థాయికి వచ్చిన గొప్ప వ్యక్తి ఎల్వీ ప్రసాద్. ఆయనే ఎన్టీ రామారావుగారిని పరిచయం చేశారు. ఇవాళ ప్యాన్ ఇండియా అంటున్నాం. కానీ ఆ రోజుల్లో పాతాళ భైరవి ఎన్టీఆర్ నటించిన 6వ సినిమా. ఇది ఆ రోజుల్లోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యి ప్యాన్ ఇండియా సినిమా అనిపించుకుంది. మొదటి తరాల్లో సన్నగా ఉన్నవారికే అవకాశాలు అనుకున్నారు. కానీ తర్వాత ఎన్టీఆర్ లాంటి భారీ మనుషులు, నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు వచ్చినప్పుడూ కొన్ని విమర్శలు వచ్చినా.. తర్వాత ఆ ఇద్దరూ తెలుగు సినిమాకు రెండు కళ్లుగా మారడం అనే చరిత్ర చూశాం. ఇక రాజకీయాల్లో ఎన్టీఆర్ సృష్టించిన చరిత్ర గొప్పదే. ఎలా చూసినా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా గొప్పదనం వ్యాపించి ఉన్న విషయాన్ని మనం గర్వంగా చెప్పుకుందాం.. ’’ అన్నారు.
సీనియర్ నటులు, నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘‘అందరికీ నమస్కారం. ఇవాళ సంతోషకరమైన దినం. ఎప్పటి నుంచో చేసుకోవాల్సిన పండగ. ఇప్పటికైనా నిర్వహిస్తున్నందుకు సంతోషం. మనమంతా ఇండస్ట్రీ మీద బ్రతుకుతున్నవాళ్లం. ఒకప్పుడు నాగేశ్వరరావుగారు ఒక మాట అన్నారు. మేం వచ్చినప్పు…

  • Related Posts

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా నరేష్ గుప్తా జన్మదిన వేడుకలు

    ఘనంగా నరేష్ గుప్తా జన్మదిన వేడుకలు

    దాడిశెట్టి రాజా ను కలిసిన ముద్రగడ…

    దాడిశెట్టి రాజా ను కలిసిన ముద్రగడ…

    కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ విప్ థామస్ జన్మదిన వేడుకలు

    కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ విప్ థామస్ జన్మదిన వేడుకలు

    అధికధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు – మండలవ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు హెచ్చరిక

    అధికధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు – మండలవ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు హెచ్చరిక

    నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఆది శంకరా కళాశాల

    నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఆది శంకరా కళాశాల

    భూ పోరాటాలు భూ సమస్యలు పై గూడూరు రిటైర్డ్ అధికారుల భవనం ఈ నెల 30న జిల్లా సదస్సు విజయవంతం చేయండి – ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ అధ్యక్షులు డి పి పోలయ్య

    భూ పోరాటాలు భూ సమస్యలు పై గూడూరు రిటైర్డ్ అధికారుల భవనం ఈ నెల 30న జిల్లా సదస్సు విజయవంతం చేయండి – ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ అధ్యక్షులు డి పి పోలయ్య