

బంగారుపాళ్యం ఫిబ్రవరి 05 మన న్యూస్
బంగారు పాళ్యం మండలం మంగళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వారి మంగళ విద్యావాణి మాస పత్రిక 33వ సంచిక ను కలెక్టర్ సుమిత్ కుమార్ గారు అసిస్టెంట్ కలెక్టర్ హిమ కుమార్ గార్లు ఆవిష్కరించారు. ఈరోజు చిత్తూరు కలెక్టరేట్ నందు పాఠశాల విద్యార్థులే రచయితలు గా వ్యవహరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో విడుదల చేస్తున్న ఏకైక మాస పత్రిక మంగళ విద్యా వాణి ని ఆవిష్కరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి మాసపత్రికను నిర్వహించడం హర్షించదగ్గ విషయమని ఈ మాస పత్రిక నిర్వహణకు తన వంతు సహాయం అందిస్తానని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి తమ పాఠశాలలోని విద్యార్థులు హేమ, లహరి, పునీతుల చే నిర్వహించే గణిత ప్రజ్ఞాధారణ కార్యక్రమాన్ని కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ విద్యార్థుల ప్రతిభను తెలుసుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో గణిత అవధాని జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు హెచ్. అరుణ శివప్రసాద్, పిల్లారప్ప, భారతి, సంపంగి పాల్గొన్నారు