

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,
మండల పరిషత్ కార్యాలయానికి పేరు లేకపోవడంతో మండలం నుంచి వస్తున్న లబ్ధిదారులు వేరే వ్యక్తులకు అడిగి మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే పరిస్థితి ఉంది. మండల పరిషత్ కార్యాలయానికి రంగులు వేసి వదిలేశారు కానీ మండల పరిషత్ కార్యాలయం పైన పేరు రాయడం ఎలా మరిచారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం లక్షల రూపాయలను వేచించి కార్యాలయాలను బాగు చేస్తుంటే ఇక్కడ నిజాంసాగర్ లో మాత్రం మండల పరిషత్ కార్యాలయానికి పేరు లేకపోవడం గమనార్ధం. ప్రజలు మండల పరిషత్ కార్యాలయానికి సమస్యలు ఇతర సమస్యలపై ఎక్కడికి వెళ్లాలనేవి తెలియలేక పోతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి మండల పరిషత్ కార్యాలయానికి పేరు రాయాలని మండల ప్రజలు కోరుతున్నారు
