

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా అయిజమండల కేంద్రమైన అయిజ ఎస్సై బదిలీపై వెళ్లడంతో వారం రోజుల క్రితం నుండి ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై శ్రీనివాస్ రావు రెగ్యులర్ ఎస్సైగా సోమవారం బాధ్యతలు చేపట్టారు.గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై విజయ్ భాస్కర్ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో శ్రీనివాస్ రావు ఎస్సైగా బాధ్యతలు చేపట్టినట్టు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ రావు మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేకంగా నిఘ ఉంచడం జరుగుతుందని,చోరీల నియంత్రణకు,జూదం,పేకాట,కోడి పందాలు తదితరాల నియంత్రణపై ఉక్కుపాదం మోపిన జరుగుతుందని తెలిపారు.నాటు సారా తయారీ, అమ్మకాలు జరగకుండా గట్టి జాగ్రత్తలు వహించడం జరుగుతుందని తెలిపారు.శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని అన్నారు.అనంతరం సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో సిబ్బంది తనకు చేదోడు వాదోడుగా ఉండి సహకరించాలని ఆయన కోరారు.