క్రీడా రంగాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మనన్యూస్,పినపాక:పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గోపాలరావు పేట గ్రామంలోని క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ ని సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అనంతరం కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు.అనంతరం వారు మాట్లాడుతూ పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయం అన్నారు.మండలంలోని అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు,ప్రజాప్రతినిధులతో కలిపి టోర్నమెంట్ నిర్వహించడం వలన అన్ని శాఖల ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొంటాయని అన్నారు.నిత్యం విధి నిర్వహణలో బిజీగా,ఒత్తిడిలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి క్రీడలలో పాల్గోనడం వలన మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చు అని అన్నారు.ప్రస్తుతం యువత క్రికెట్ క్రీడ పట్ల ఆసక్తి కలిగి ఉంటున్నారని అన్నారు.ఆదివారం జరిగిన మహిళల అండర్ 19 వరల్డ్ కప్ ని భారత జట్టు గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మహిళల క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.వరల్డ్ కప్ టోర్నమెంట్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్,ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ని సొంతం చేసుకున్న భద్రాచలం కి చెందిన క్రీడాకారిణి గొంగడి త్రిషను ప్రత్యేకంగా అభినందించారు.మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో జన్మించి పట్టుదలతో అంతర్జాతీయ స్థాయిలో మన జిల్లా పేరును నిలబెట్టడం పట్ల జిల్లా ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు.యువత చదువు తో పాటు క్రీడలలో రాణించడం వలన పుట్టి పెరిగిన గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.అదేవిధంగా పినపాక మండల కేంద్రంలోని గోపాలరావుపేట గ్రామంలో ఉన్న ఈ క్రీడా ప్రాంగణం చాలా విశాలవంతంగా ఉందని ఈ గ్రౌండ్ ని అధికారికంగా తీసుకొని ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం,ప్రెస్ క్లబ్ సభ్యులు బిల్లా నాగేందర్,బూరా శంకర్,కీసర సుధాకర్ రెడ్డి,సనప భరత్,ముక్కు మహేష్ రెడ్డి,కట్టా శ్రీనివాసరావు,కొంపెల్లి సంతోష్,గాడుదల దిలీప్,నిమ్మలింగారెడ్డి,నగేష్,కోటి,జగదీష్,సాయి ప్రకాష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,గొపాలరావుపేట గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..