

బంగారుపాళ్యం.ఫిబ్రవరి 02 మన న్యూస్
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం నందు నూతనంగా ప్రారంభించిన డయాలసిస్ సెంటర్ నందు ఆదివారం బంగారుపాళ్యం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్ పి జయప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఎన్ పి జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్ర లో ఇచ్చిన హమీ బంగారుపాళ్యం లో తెలుగుదేశం పార్టీ అధికారంలో కి వచ్చిన వెంటనే బంగారుపాళ్యం మండలంలో డయాలసిస్ సెంటర్ ప్రారంభిస్తామని హమీ ఇచ్చి వంద రోజులలోపు డయాలసిస్ సెంటర్ ప్రారంభించినందుకు బంగారుపాళ్యం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్ పి జయప్రకాష్ నాయుడు నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ డయాలసిస్ సెంటర్ నందు అనేక మంది చికిత్స పొందుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు లోకనాథ నాయుడు, కమలానాథ్ రెడ్డి, మండల కార్యదర్శి జనార్దన్ గౌడ్, మండల తెలుగుయువత అధ్యక్షులు రమేష్, గిరిబాబు,టిడిపి నాయకులు సూరి నాయుడు,రాజేంద్ర నాయుడు,మైనారటి నాయకులు జాకీర్,నాసిర్, దేవాయణి,బిసి నాయకులు హరి, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు
