

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:
సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. పదవి విరమణ చేసిన యు టి ఎఫ్ నాయకుడు, స్థానిక గవర్నమెంట్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు
కె ఎస్ ప్రకాశరావు ను సతీసమేతంగా ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం లో ఉపాధ్యాయులు పాత్ర అమోగమైనదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు యు సోమరాజు, యు టి ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు టి సంజీవ్, కె రవి, సీనియర్ నాయకులు జి సుందర్రావు, జట్ల సోమరాజు, మెతకాని రాంబాబు తదితరులున్నారు.