

మనన్యూస్,బడంగ్పేట్:మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ లోని తోట జంగారెడ్డి గార్డెన్ లో శ్రీ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ నాదర్గుల్ 6వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిలుగా మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి,బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి,మీర్పేట్ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి హాజరయ్యారు.ఈ సందర్భంగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఇంత పెద్ద సంఘం,కార్యక్రమం ఏర్పాటు చేసిన విశ్వబ్రాహ్మణ సంఘం వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ నారు వ్యవస్థాపకులు వి జంగాచారి,జి రాజు చారి మాట్లాడుతూ వచ్చే సంవత్సరం నుండి భర్త చనిపోయిన మహిళలకి శ్రీ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ నాదర్గుల్ తరపున పింఛన్ అమల్లోకి తెచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు దీనికి సంఘ సభ్యులందరూ సహాయ సహకారాలు అందిస్తూ నాదర్గుల్ విశ్వబ్రాహ్మణ సంఘం దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన సంఘంగా వెలుగులోకి రావాలని కోరుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ నాదర్గుల్ గౌరవ వ్యవస్థాపకులు వి.జంగా చారి,సహాయ వ్యవస్థాపకులు జి రాజు చారి,కోశాధికారి పులియోజు వెంకట చారి,రామిడి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.