సుమంత్ మహేంద్రగిరి వారాహి లో బ్రహ్మానందం డిఫరెంట్ లుక్ రిలీజ్ !!!

రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్‌ నెంబరు – 2 చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ చిత్ర గ్లిమ్స్ ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు అలాగే గ్రిమ్స్ ఆసక్తికరంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు, గ్లిమ్స్ కు విశేష స్పందన లభించింది.తాజాగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా మహేంద్రగిరి వారాహి సినిమా నుండి విలక్షణ నటుడు బ్రహ్మానందం లుక్ విడుదల చేశారు, లుక్ ను పరిశీలిస్తే… వారాహి అమ్మవారు తో పాటుగా బ్రహ్మానందం ఒక డిఫరెంట్ లుక్ లో సాంప్రదాయబద్దంమైన దుస్తుల్లో కనిపిస్తున్నారు. డివోషనల్ టచ్ తో వస్తోన్న సూపర్ న్యాచురల్ మహేంద్రగిరి వారాహి సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత కాలిపు మధు తెలిపారు. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుమంత్ హీరోగా నటించిన సుబ్రహ్మణ్యపురం సినిమా విజయం సాధించిన విషయం తెలిసిందే. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

  • Related Posts

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మీరు చూపిస్తున్న అభిమానం మరవలేనిది..నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోలేనిది…

    మీరు చూపిస్తున్న అభిమానం మరవలేనిది..నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోలేనిది…

    పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

    పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

    నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు.

    నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు.

    చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, పోలీసు, రెవిన్యూ అధికారులు.

    చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, పోలీసు, రెవిన్యూ అధికారులు.

    రాష్ట్రస్థాయి క్రీడ పాఠశాలల ప్రవేశ పోటీలలో నారాయణ పేట జిల్లా క్రీడాకారుల ప్రతిభ.

    రాష్ట్రస్థాయి క్రీడ పాఠశాలల ప్రవేశ పోటీలలో నారాయణ పేట జిల్లా క్రీడాకారుల ప్రతిభ.

    33 కోట్ల రూపాయలతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి.జుక్కల్ ఎమ్మెల్యే తోట

    • By RAHEEM
    • June 30, 2025
    • 10 views
    33 కోట్ల రూపాయలతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి.జుక్కల్ ఎమ్మెల్యే తోట