

మనన్యూస్,తిరుపతి:భారతదేశపు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలలో దేశంలోని రెండు కోట్ల మంది మధ్య తరగతి ఉద్యోగులు,పెన్షనర్లు ఇతర సామాన్య ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టి గోపాల్ హర్షం వ్యక్తం చేశారు.వార్షిక ఆదాయం 12లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం ఒక చారిత్రాత్మకమైన ప్రతిపాదనని తెలిపారు.దీనివల్ల 12 లక్షల రూపాయలు ఆదాయం సంపాదించే మధ్య తరగతి ఉద్యోగికి 80,000 వరకు పన్ను చెల్లించకుండా ఆదాయం మిగులుబాటు వస్తుందన్నారు.తద్వారా మధ్యతరగతి ఉద్యోగి ఆర్థిక కొనుగోలు శక్తి పెరుగుతుందని ఇది వారి కుటుంబానికి ఎంతో మేలు చేకూరుస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టి గోపాల్ హర్షం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది పెన్షనర్లు ఉండగా వారిలో 90 శాతం మంది పెన్షన్లకు ఇక టాక్స్ చెల్లించే అవసరం లేకుండా వారు ప్రశాంతంగా విశ్రాంతి జీవనం గడపడానికి వారికి ఆర్థిక బలం చేకూర్చే విధంగా కొత్త బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు.