*W/O అనిర్వేష్* మూవీ పోస్టర్ లాంచ్

MANA News:- గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి తదితరులు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం W/O అనిర్వేష్. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది, ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ గారి చేతుల మీదగా ఫిలిం ఛాంబర్ లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగాఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తో రూపొందిన W/O అనిర్వేష్ చిత్రం కచ్చితంగా మంచి హిట్ సాధిస్తుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు. నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ఎడిటింగ్ అని “లింక్డ్ స్క్రీన్ ప్లే” అనే ఫిలిం టెక్నీక్ తో ఎడిటర్ హేమంత్ నాగ్ కొత్త తరహా ఎడిటింగ్ ని ప్రేక్షకులకు అందిస్తున్నాము అన్నారు.ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితం లో జరిగిన ఇబ్బందులని తనకు తెలిసిన కళతో ఎలా ఎదుర్కొని పరిష్కరించాడు అనేది దర్శకుడు ఆసక్తిగా తెరకెక్కించారని, మా బ్యానర్లో రాబోతున్న W/O అనిర్వేష్ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది అని అన్నారు. ఈ చిత్రాన్ని ఎస్ కె ఎం ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.

  • Related Posts

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    బీఎస్పీ ప్రత్తిపాడు ఇన్చార్జిగా గునపర్తి అపరూప్…

    బీఎస్పీ ప్రత్తిపాడు ఇన్చార్జిగా గునపర్తి అపరూప్…

    మీరు చూపిస్తున్న అభిమానం మరవలేనిది..నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోలేనిది…

    మీరు చూపిస్తున్న అభిమానం మరవలేనిది..నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోలేనిది…

    పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

    పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

    నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు.

    నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు.

    చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, పోలీసు, రెవిన్యూ అధికారులు.

    చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, పోలీసు, రెవిన్యూ అధికారులు.

    రాష్ట్రస్థాయి క్రీడ పాఠశాలల ప్రవేశ పోటీలలో నారాయణ పేట జిల్లా క్రీడాకారుల ప్రతిభ.

    రాష్ట్రస్థాయి క్రీడ పాఠశాలల ప్రవేశ పోటీలలో నారాయణ పేట జిల్లా క్రీడాకారుల ప్రతిభ.