

మనన్యూస్,గొల్లప్రోలు:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలోని జగనన్న కాలనీ వాసులకు ముంపు భారీ నుండి విముక్తి లభిస్తుంది.కొద్దిపాటి వర్షానికే కాలనీ వాసుల రాకపోకలకు అంతరాయం ఏర్పాడేది.కాలనీ వాసులు మధ్య తరగతి,పేదవారు కావడం తో అనేక కష్టాలు పడేవారు.చిరువ్యాపారులు,కూలీనాలీ చేసుకొని జీవించే పేద ప్రజలు పస్తులతో జీవించే వారు.అన్నమో రామచంద్ర అంటూ దాతలు అందించే ఆహారం కోసం ఎదురు చూసేవారు.ఆడపిల్లలు బడికి పోదామన్న అష్టకష్టాలు పడేవారు.ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్,మాధురి విద్యాసంస్థలు అదినేత కడారి తమ్మయ్య నాయుడు,తెలగంశెట్టి వెంకటేశ్వరరావు,మురాలశెట్టి సునీల్ కుమార్,బలి రెడ్డి గంగబాబు,బస్సా చిట్టిబాబు,ఓదూరి నాగేశ్వరరావు,కిషోర్ తదితర నాయకులు కాలనీ వాసులను అందుకోవడమే కాకుండా పవన్ కు సమస్య తీవ్రతను వివరించారు.సమస్యను సావధానంగా విన్న ఉప ముఖ్యమంత్రి ఉదృతంగా ప్రవహిస్తోన్న సుద్దగడ్డ కాలువ ద్వారా నాటుపడవపై ప్రయాణించి కాలనీ వాసులను పరామర్శించి ఓదార్చారు.అనంతరం పయనమై వెళ్లి అధికారులు తో సమావేశం నిర్వహించారు.సుద్దగడ్డ పై బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి రావాలని ఆదేశించారు.స్పందించిన అధికారులు ప్రతిపాదనలు రూపొందించి సమాచారాన్ని ఉప ముఖ్యమంత్రి కి అందించారు.దీనితో పవన్ కళ్యాణ్ జగనన్న కాలనీ కి 4 కోట్ల రూపాయల పై చిలుకు నిధులు కేటాయించి వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.జోరుగా బ్రిడ్జి నిర్మాణ పనులు
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల తో ఇంజనీరింగ్ అధికారులు బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టారు.నాన్చకుండా నాణ్యత ప్రమాణాలు పాటించడం ద్వారా పూర్తి చెయ్యాలని అప్పట్లో అధికారులకు సూచించారు.అలాగే స్తానిక జనసేన పార్టీ నాయకులు బలి రెడ్డి గంగబాబు బస్సా చిట్టిబాబు తదితరులు ప్రతిరోజూ పనులను పర్యవేక్షిస్తున్నారు.దీంతో బ్రిడ్జి నిర్మాణ పనులు జోరందు కున్నాయి.పవన్ చొరవ తో కాలనీ వాసులకు మహర్దశ పట్టుకుందని,అలాగే త్రాగునీరు,వీధి రోడ్లు, డ్రైన్ నిర్మాణాలు చేపట్టాలని పవన్ కు రుణపడి ఉంటామని కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.