ప్రజారక్షణకే పోలీసు వ్యవస్థ, ప్రజలు సహకరించాలి.

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:,
ప్రజారక్షణకే పోలీస్ వ్యవస్థ ఉందని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు నియోజకవర్గ ప్రజలకు బుధవారం విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండలాలకు చెందిన 4గురు సబ్ ఇన్స్పెక్టర్లు, ప్రత్తిపాడు సిఐలు సంయుక్త ప్రకటన వెలువరించారు. ఈ ప్రకటనలోప్రజలకు నిరంతరం సేవలందించడంలో పోలీసు వ్యవస్థ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అన్నారు. మీకు పోలీస్ వారి సహాయం అవసరమైనప్పుడు, మీ సమస్యలను, మీ గ్రామాలలో, మీ చుట్టుపక్కల జరిగే అసాంఘిక కార్యక్రమాల గురించి మీరు నేరుగా మీ పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా తెలియపరచవచ్చు అన్నారు. పోలీస్ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయని, సహాయం కోరు, సమాచారం ఇచ్చేవారు వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ విషయంలో ఎవరూ సందేహించవలసిన అవసరం లేదన్నారు. మీరు సంప్రదించవలసిన ప్రత్తిపాడు సర్కిల్ అధికారుల ఫోన్ నెంబర్లు సి.ఐ ప్రత్తిపాడు :9440796530,ఎస్.ఐ ప్రత్తిపాడు:9440796570,ఎస్.ఐ అన్నవరం:9440796571,ఎస్.ఐ ఏలేశ్వరం:
9440904835,ఎస్.ఐ రౌతులపూడి:9440796552
అలాగే ప్రజలు మీరు దేశంలో గాని, రాష్ట్రంలో గాని, ఏ జిల్లాలో గాని, ఏ ప్రాంతంలో ఉన్నా అత్యవసర పరిస్థితుల్లో పోలీసువారి సేవలు కొరకు టోల్ ఫ్రీ నెంబర్: 112 కి డయల్ చేసి తక్షణమే పోలీసు వారి సహాయాన్ని పొందవలసిందిగా కోరారు. మరో ముఖ్య విషయం ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండి మీకు గుర్తుతెలియని వ్యక్తులు నుండి ఫోన్ గాని, మెసేజ్ గాని వచ్చిన వారికి మీ యొక్క వ్యక్తిగత వివరాలను , ఓటీపీని గాని తెలియపరచకుండా మిమ్మల్ని మీరు సైబర్ నేరాలు నుండి కాపాడుకోవచ్చు అన్నారు. మీరు ఊరికి వెళ్లే సమయంలో ఇంటి నందు ఎటువంటి విలువైన బంగారు వస్తువులు, డబ్బులు ఉంచకుండా బ్యాంకు నందు గాని మీ బంధువులు వద్ద గానీ భద్రపరచుకోగలరని, అదేవిధంగా మీ దగ్గరలోని పోలీసు వారికి మీరు ఊరు వెళ్తున్న విషయాన్ని తెలియపరచడం ద్వారా పోలీసువారి పర్యవేక్షణ పొందగలరని ఆ ప్రకటనలో పోలీస్ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.ముఖ్యంగా ప్రజలు వారి వారి ఇంటి వద్ద, వారి వ్యాపార సముదాయాలు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను నియంత్రించడమే కాకుండా, ఏదైనా నేరం జరిగిన సందర్భంలో నేరస్తులను గుర్తించి, వారిని అరెస్ట్ చేసి బాధితులకు తగిన న్యాయం చేయుటకు పోలీసు వారికి సహకరించిన వారు అవుతారు ప్రత్తిపాడు సీఐ ప్రకటన లో తెలియజేశారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి