

మనన్యూస్,తవణంపల్లె:అందిన సమాచారం మేరకు రాయల్ పేట నుండి తవణంపల్లి మండలం మాధవరం గ్రామానికి ద్విచక్ర వాహనంలో వినయ్ తన అక్కతో కలిసి అటవీ దారిగుండా వస్తుండగా మార్గ మద్యంలో వారిని అడ్డగించి వారిపై కారంపొడి చల్లి దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు.అదే సమయానికి కొందరు వ్యక్తులు అటుగా రావడం గమనించి దుండగులు పారిపోవడం జరిగింది.అక్కడున్న వారు దుండగుల చేతిలో గాయపడిన అక్క తమ్ముడు ని హుటాహుటిన అరగొండ అప్పోలో హాస్పిటల్ కి తరలించడం జరిగింది.
ఈ దాడిలో వినయ్ కాలు విరగడంతో పాటు తన అక్క కాలుకు గాయాలు అయ్యాయి.ఈ సంఘటనతో సమీప గ్రామాల్లో ని ప్రజలు భయబ్రాంతులకు గురువ్వుతున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.