

Mana News :- జిల్లా కేంద్రం చిత్తూరులో స్థానిక పిసిఆర్ సర్కిల్లో 36వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం సాయంత్రం ట్రాఫిక్ సిఐ నిత్య బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు మహిళ ఉద్యోగులు పాల్గొని ఘనంగా నిర్వహించారు. హేమలత మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించండి, ప్రమాదాల నుండి కాపాడుకోండి అని అన్నారు. మద్యపానం తాగి వాహనాలు నడపవద్దు, సీట్ బెల్ట్ ధరించి వాహనాలను నడపండి, అతివేగం ప్రమాదకరమని వెల్లడించారు.