

తమకు న్యాయం చేయండి కుటుంబ సమేతంగా దళిత రైతులు నిరసన
మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం తాసిల్దార్ కార్యాలయంలో పెట్రోలు పోసి ఆత్మహత్యకు పాల్పడ ఘటన మండలంలో చోటుచేసుకుంది మేరకు ఎస్ఆర్ పురం మండలం పాతపాలెం దళితవాడకు చెందిన రైతులు శాంతి, వెంకటేశులు , నాగయ్య సర్వేనెంబర్ 179 లో రెండు ఎకరాల 22 సెంట్లు సాగులో ఉంది రెవెన్యూ సిబ్బంది అక్రమంగా నరికి వేశారు. అక్రమంగా నరికి వేసిన చెట్లను మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసి నిరసన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రెవిన్యూ సిబ్బంది మా పొలం కొచ్చి చెట్లను నరికి వేశారని తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సమేతంగా ఎస్ఆర్ పురం మండలం తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.