మునిసిపల్ అధికారులు అక్రమ కట్టడం అంటూ నిట్టనిలువునా కూల్చి వేసిన వై సి పి నాయకుడు బాలకృష్ణారెడ్డి ఇల్లు

మనన్యూస్,నెల్లూరు:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మరియు నియోజకవర్గ ఇంచార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించి టిడిపి చేసిన దౌర్జన్యకాండ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేసి పార్టీ అండగా ఉంటుందని బాలకృష్ణ రెడ్డి కి భరోసానిచ్చి టీడీపీ నేతలను హెచ్చరించారు.
నెల్లూరు,బాలాజినగర్ 15 వ డివిజన్ లో మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడం అంటూ కూల్చివేసిన వైఎస్ఆర్సిపి నాయకులు బాలకృష్ణారెడ్డి ఇంటిని మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి,నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి.వై సి పి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్బంగా టిడిపి చేసిన దౌర్జన్యకాండకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి నాయకులు నిరసన తెలియజేశారు.కాకాణి గోవర్ధన్ రెడ్డి పి.చంద్రశేఖర్ రెడ్డి బాలకృష్ణ రెడ్డి తో మాట్లాడి పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసానిచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు ధమనకాండ నిర్వహిస్తుందని జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు.
అందుకు పరాకాష్టగా బాలకృష్ణ రెడ్డి ఇంటిని దౌర్జన్యంగా కూల్చి వేశారని పేర్కొన్నారు.ఇష్ట రీతిలో వ్యవహరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్ల ను మంత్రి నారాయణ,శ్రీనివాసులు రెడ్డి లు కూల్చివేస్తామంటే.ఇది సరైన పద్ధతి కాదని అన్నారు.ఇది మా జాగీరు అన్న రీతిలో వ్యవహరిస్తే.కూటమి నేతలకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతు మంత్రి నారాయణ కు నెల్లూరు ప్రజలు 70 వేలకు పైగా మెజారిటీ ఇచ్చి గెలిపించింది.సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడానికా అని ప్రశ్నించారు.
ఈరోజు మంత్రి నారాయణ నెల్లూరు నగరంలో. సామాన్యులనే కాదు,వైద్యులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు.పొగతోటలోని డాక్టర్లకు సంబంధించిన హాస్పిటల్ నేమ్ బోర్డులను తొలగిస్తూ,వారి కట్టడాలను కూల్చి వేస్తూ మరికొందరి కట్టడాలను కూల్చివేస్తామంటూ బెదిరింపులకు దిగుతూ డాక్టర్లను మంత్రి నారాయణ భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమపాలన కొనసాగిస్తున్నారని అన్నారు.నెల్లూరులో పేద మధ్యతరగతి వారి ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేస్తూ.మంత్రి నారాయణ నెల్లూరు ను సర్వ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
అంతేకాకుండా చిన్నచిన్న ఇళ్లను కూడా.మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ టేపులతో కొలిపించి మరి పన్నులు వేస్తూ.ప్రజలను పీడించుకుని తింటున్నాడని దుయ్యబట్టారు.పన్నులు కట్టలేని స్థితిలో ఉన్న పేద వారిపై.జులం ప్రదర్శిస్తూ వారి ఇంటి కరెంట్ కనెక్షన్,మంచినీటి కనెక్షన్ లు కట్ చేసి నారాయణ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని అన్నారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలే కాదు ప్రజలు ఎవరిపైనైనా..తెలుగుదేశం పార్టీ చేస్తున్న.అక్రమాలను ముందుగా తెలియజేస్తే వారికి పార్టీ అండగా ఉండడమే కాకుండా వారి పక్షాన నిలబడి న్యాయపోరాటం చేస్తామని తెలియజేశారు.ప్రత్యేకంగా ఈరోజు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు నగర నియోజకవర్గానికి విచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాలకృష్ణ రెడ్డి కుటుంబానికి అండగా నిలబడినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

  • Related Posts

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 8 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//