

మనన్యూస్,తిరుపతి:తిరుపతికి చేరిన కాశ్మీర్ నుండి కన్యాకుమారి గోరక్ష పాదయాత్ర బాలకృష్ణ గురుస్వామికి ఘన స్వాగతం నేటి అత్యాధినిక సమాజంలో గో సంరక్షణే ప్రతి ఒక్కరికి శ్రీరామరక్ష అని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోరక్ష మహాపాదయాత్ర నిర్వహిస్తున్న బాలకృష్ణ గురు స్వామి హితవు పలికారు. మంగళవారం ఉదయం బాలకృష్ణ గురు స్వామి బృందం పాదయాత్రలో భాగంగా తిరుపతికి చేరుకున్నారు. వీరికి తొలుత రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన సభ్యులు స్వాగతం పలికారు.అనంతరం ఆయన అక్కడ నుంచి లీలామహల్ సర్కిల్ మీదుగా నంది సర్కిల్ నుండి అలిపిరి గోశాల వరకు పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోరక్షణ భూ రక్షణ పర్యావరణ పరిరక్షణ నిమిత్తం దేశ రక్షణ కోసం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గత ఏడాది సెప్టెంబర్ లో ప్రారంభించిన గోరక్ష మహాపాదయాత్ర నేడు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి చేరుకోవడం ఇక్కడ ఆర్ హెచ్ వి ఎస్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు సంఘీభావం తెలిపే పాదయాత్రలో పాల్గొనడం అభినందనీయమన్నారు.180 రోజుల్లో 14 రాష్ట్రాల మీదుగా 4900 కిలోమీటర్లు ఈ పాదయాత్ర నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.ఇప్పటికే 10 రాష్ట్రాల మీదుగా 3500 కిలోమీటర్ల పైగా ప్రయాణం చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి చోటా భారతీయ హిందూ పౌరులు ఘన స్వాగతం పలకడం తనకు గర్వకారణంగా ఉందన్నారు.తిరుపతిలో విశేష సంఖ్యలో స్థానికులు హాజరై తమ బృందానికి సంఘీభావం తెలపడం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తనకు లభించిన సంఘీభావం జీవితంలో మరచిపోలేనిదన్నారు.ఆర్ హెచ్ వి ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి,రాష్ట్ర ఉపాధ్యక్షులు మునిరాజు సుకుమార్ రాజు మాట్లాడుతూ ఆధ్యాత్మిక సనాతన ధర్మాలను పరిరక్షించే నిమిత్తం పాదయాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు.విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మురళిమ్మ మాట్లాడుతూ గోవులను పూజించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ పాదయాత్రలో స్థానిక హిందూ బంధువులు విశేష సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపి బ్రహ్మరథం పట్టారు.ఈ కార్యక్రమంలో వీరితోపాటు నగర ప్రముఖులు,డాక్టర్లు రిటైర్డ్ అధికారులు,అన్ని విభాగాల మహిళలు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్,భారత్ మాతాకీ జై,గోమాతకు జై,వందేమాతరం,గోవింద నామ స్మరణలతో నగరం మారుమ్రోగింది.