

*మన న్యూస్, గంగాధర నెల్లూరు:-* ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ చిత్తూరు జిల్లా సర్వసభ్య సమావేశం సోమవారం సాయంత్రం చిత్తూరులో జరిగింది. రాష్ట్ర నాయకత్వం తరఫున జిల్లా ఎన్నికల పరిశీలకులుగా కడప జిల్లాకు చెందిన కామ్రేడ్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. అధ్యక్షులుగా చల్లా జయచంద్ర 10టీవీ చిత్తూరు,ప్రధాన కార్యదర్శిగా నీరజాక్షలు(చిన్న)TV9 గంగాధర నెల్లూరు,వర్క్ ప్రెసిడెంట్ గా ఎం కుమార్ ఐ న్యూస్ కుప్పం, ఉపాధ్యక్షులుగా శివశంకర్ రాజు హెచ్ఎంటీవీ పుంగనూరు,కృష్ణమూర్తి సికేఎన్ చిత్తూరు, సుబ్రహ్మణ్యం టీవీ9 కుప్పం, విజయ్ హెచ్ఎం టివి, విజయ్, దేవేంద్ర మహా న్యూస్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కేశవులు సిటీ కేబుల్, సహాయ కార్యదర్శులుగా లోకేష్ టీవీ ఫైవ్, సుబ్రహ్మణ్యం సాక్షి టీవీ, మురళీకృష్ణ సెవెన్ హిల్స్ టీవీ, రవి జీటీవీ, కమలాకర్ రెడ్డి ఆర్ టి వి, మంజునాథ్ ప్రైమ్ నైన్, జావిద్ బిఆర్ న్యూస్, కోశాధికారిగా అక్రమ్ ఎన్టీవీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.