

*మన న్యూస్ ఎస్ఆర్ పురం :-* ఎస్ఆర్ పురం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ 49.కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన ప్రజాశక్తి విలేఖరి ఎట్టేరి దేవరాజులు సోమవారం చిత్తూరు జిల్లా కేంద్రంలో జరిగిన ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా స్థాయి ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వివరాలు ఇలా… సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా కేంద్రంలో ఏపీ డబ్ల్యు జేఎఫ్ జిల్లా ఎన్నికలు ఎన్నికల అధికారి జయరాజ్ గంగాధరం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించారు. నియోజకవర్గ నుంచి ఉపాధ్యక్షుడిగా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎట్టెరి దేవరాజులు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం దేవరాజులు ను ఎన్నికల అధికారి ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటించారు.