

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: జిల్లా ఉత్తమ ఆరోగ్య విస్తరణ అధికారిగా కోమటి భాస్కరరావు కు అవార్డు లభించింది. ఈ మేరకు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డిఎం అండ్ హెచ్ ఓ ఎం జె నరసింహ నాయక్ చేతులమీదుగా గెద్దనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య విస్తరణదిగారిగా పనిచేస్తున్న కె భాస్కర్ రావు ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కోమటి భాస్కరరావు మాట్లాడుతూ వృత్తిపట్ల అంకితభావంతో పనిచేస్తే అవార్డులు వాటి అవే వస్తాయన్నారు. మన విధి నిర్వహణలో ఏ ప్రాంతమైన అక్కడ ప్రజలతో మమేకమై నాడు వారు తనని సొంత బిడ్డలా చూసుకుంటారని తెలిపారు. తాము నిర్వహించే వృత్తి లో భాగంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి ఆరోగ్య పరిరక్షణకై సంబంధించిన సూచనలు సలహాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను నేర్పడం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతామన్నారు. ఈ అవార్డు రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. సోమవారం డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ పి సరిత (పెద్దాపురం డివిజన్) గెద్దనాపల్లి ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యురాలు సిహెచ్ జ్యోతి మణిమాల, వైద్యులు ఎస్ అభిషేక్. ఆరోగ్య పరిరక్షకుడు ఎస్వీ రమణ కార్యాలయం సిబ్బంది భాస్కరరావును అభినందించారు.