

మనన్యూస్,కామారెడ్డి:గాంధారి మండల కేంద్రానికి చెందిన బంజ నాగయ్య వారసులైన బంజ శంకర్ అప్ప, బంజ సంగప్ప,బంజరాజప్ప లు తమ తాతల నాటి భూమి సర్వే నెంబర్ మూడులో ఉన్న స్థలాన్ని మండల కేంద్రానికి చెందిన బమన్ రవి అనే వ్యక్తి ఇతరులతో కలిసి తమను బెదిరిస్తూ కబ్జా చేసుకుని వాటిని ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారని,వీరికి ప్రభుత్వం అధికారులు సహకరిస్తున్నారని,ఆ భూమిపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శి మండల తహసిల్దార్లు తమ స్థలాన్ని సర్వే నెంబర్ వేయకుండా అసెస్మెంట్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని గాంధారి మండల కేంద్రానికి చెందిన భమన్ రవి అని వ్యక్తి తమ భూమిని కబ్జా చేసి తప్పుడు పత్రాలు సృష్టించుకుని వారసత్వ భూమిగా చెప్తూ తప్పుడు రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నాడు అన్నారు.దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరమన్నారు.