

మనన్యూస్,చైతన్యపురి:చైతన్యపురి డివిజన్ లో 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జండా ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నాడు ఎంతో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు శివ ప్రకాష్ పాల్గొని మాట్లాడారు.రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ అంబేద్కర్ ఆశే సాధన ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందడుగు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫనిగిరి కాలనీ ప్రెసిడెంట్ అజయ్ కుమార్,వైస్ ప్రెసిడెంట్,నరేందరరెడ్డి,రవి యాదవ్,కాలనీ అసోసియేషన్ సభ్యులు,కాలనీ వాసులు,తదితరులు పాల్గొన్నారు.