

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ప్రత్తిపాడు నియోజవర్గం హై స్కూల్ 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకలకి స్తానిక శాసనసభ్యురాలు వరపుల సత్య ప్రభ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ స్వతంత్ర సమరయోధులు,జాతీయ నాయకుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం స్థానిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జాతీయ జెండా ఎగుర వేశారు.విద్యార్థులు జాతీయ గీతాలు,దేశభక్తి గేయాలతో అందరినీ అలరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ ప్రసంగిస్తూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలను మరువలేము అన్నారు. మరపురాని వారి పోరాటాలు, త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా,స్వాతంత్ర్యాలు అన్నారు. ఎందరో మహానుభావులు ఈదేశ స్వాతంత్రం కోసం ఎన్నో కోల్పోయారు అన్నారు. ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు,ఆస్తులు త్యాగం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు అన్నారు.ఏళ్ల తరబడి జైళ్లలో ఉన్నవారు.బ్రిటిష్ వారి కొరడా దెబ్బలు తిన్నవారు.బ్రిటిష్ వారి బుల్లెట్ లకు బలైన వారు.ఉరికంభంనకు వేలాడిన వారూ.ఇలా ఎందరో త్యాగ ధనులు ఉన్నారు అన్నారు.వారి అందరి త్యాగ ఫలం.నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచా స్వాతంత్ర్యాలు అన్నారు.స్వతంత్ర సమరయోధులు అందరికీ ఘన నివాళులు అర్పించే ఈనాటి కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం నిజంగా అదృష్టం గా భావిస్తున్నాను అన్నారు.స్వతంత్ర భారత దేశంలో పౌరులకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వంనకు, చట్టం , న్యాయంలకు ప్రవర్తనా నియమావళి రూపొందించడం కోసం ఒక రాజ్యంగము అవసరం అనీ దాని కోసం ఒక రాజ్యాంగ రచన చేపట్టాలని 1946 లో ఆనాటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు నిర్ణయం తీసుకొన్నారు అన్నారు.డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7 గురు సభ్యులతో కూడిన ఒక రాజ్యాంగ రచనా కమిటీనీ. రాజ్యాంగ పరిషత్ నియమించింది అన్నారు
మనం అనుభవిస్తున్న ప్రాథమిక హక్కులు , ఆదేశిక సూత్రాలు అన్నీ రాజ్యాంగ ఫలితమే అన్నారు.అంతటి మహోన్నత రాజ్యాంగం 1950 జనవరి 26 న అమలులోకి వచ్చింది అనీ, దాని ప్రాధాన్యతను విశిష్టతను కాపాడుకుంటూ, స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాము అన్నారు.కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.