

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: జిల్లా ఉత్తమ గ్రంథాలయ పాలకుడిగా ఏలేశ్వరం లైబ్రేరియన్ కవికొండల సత్యనారాయణ ఎంపికయ్యారు. ఈ మేరకు కాకినాడలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సాగిలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చేతులమీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. సత్యనారాయణ ఏలేశ్వరం లైబ్రరీ భవనాన నిర్మాణంలోనూ, లింగంపర్తి లో పనిచేస్తూ లింగంపర్తి లైబ్రరీ భవన నిర్మాణానికి కృషి, నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు పుస్తకాల సేకరణ లోను, వేసవి విజ్ఞాన శిబిరాలు, మొక్కలను నాటడం తదితర సామాజిక కార్యక్రమాలలో విశేష సేవలు అందించినందుకు గాను ఈ పురస్కారం లభించింది. సత్యనారాయణ కు ఈ పురస్కారం లభించడం పట్ల పలువురు అభినందిస్తున్నారు.