

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఏలేశ్వరం నగర పంచాయతీలోని స్థానిక కోనేటి బడి ఆవరణలో, జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి మండల రెవెన్యూ డిప్యూటీ తాసిల్దార్ కుసరాజు, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సం సందర్భంగా పాఠశాల అధ్యాపకుల సమక్షంలో విద్యార్థినిలతో అవగాహన సదస్సు చేపట్టారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పై అవగాహన కలిగి ఉండాలని, ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ పాన్నాల, ప్రధానోపాధ్యాయులు గణపతి పాఠశాల అధ్యాపకులు వీఆర్వోలు, కిషోర్, రమణ, శ్రీనివాస్, అనిల్,వరలక్ష్మి,రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు