

ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ కు కృతజ్ఞతలు తెలిపిన చిన్న బాపనపల్లి గ్రామస్తులు
మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం చిన్న బాపనపల్లి గ్రామంలో త్రాగునీరు బోరు చెరువులో ఉండడంతో త్రాగునీరు బోరు మరమ్మతు గురైందని త్రాగునీరు కోసం ఇబ్బంది పడుతున్నామని చిన్నబాపనపల్లి గ్రామస్తులు గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు తెలియజేయడంతో వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ థామస్ స్పందించి ఎస్ఆర్ పురం మండల ఎంపీడీవో మోహన్ మురళి ఆ గ్రామానికి తాగునీరు కల్పించాలని ఎమ్మెల్యే తెలపడంతో వెంటనే చిన్న బాపనపల్లి గ్రామానికి వెళ్లి గ్రామంలో ఉన్న కొత్త బోరు లో పైపులు మోటరు ఏర్పాటు చేసి గ్రామస్తులకు తాగునీరు సౌకర్యం కల్పించారు . సకాలంలో స్పందించిన మా గ్రామానికి త్రాగునీరు అందించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కి రుణపడి ఉంటామని తెలిపారు ..