

మన న్యూస్, గంగాధర నెల్లూరు :- రైతు సంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి రైతు నాయకుడు పాచిగుంట మనోహర్ నాయుడు అని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ గారి సతీమణి శాంతి రెడ్డి అన్నారు. గురువారం గంగాధర్ నెల్లూరు మండలం పాచిగుంట గ్రామంలో పాచిగుంట మనోహర్ నాయుడు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పాచిగుంట మనోహర్ నాయుడు తెలుగుదేశం పార్టీకి పార్టీ అభివృద్ధికి ఎనలేని సేవలను చేశారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కుమారులు డాక్టర్ రాహుల్, రోషన్ , మనోహర్ నాయుడు కుమార్తె శిల్ప, మండల అధ్యక్షుడు స్వామి దాస్, మహిళ నాయకురాలు ఇందిరమ్మ, ఎస్ఆర్ పురం మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడు, జనసేన పార్టీ ఇన్చార్జి యుగంధర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
