

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:
సంప్రదాయ సంక్రాంతి పోటీల్లో భాగంగా తెలుగుదేశం,జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు.కూటమి నేతలు బస్సా ప్రసాద్, మైరాల కనకారావు గంగిరెడ్ల మణికంఠ,ఆకుల నాని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీల్లో యర్రవరం,కొత్త యర్రవరం గ్రామాల నుండి 52 మంది మహిళలు చిన్నారులు పాల్గొన్నారు. ప్రధమ,ద్వితీయ,తృతీయ విజేతలకు నాయకుల చేతుల మీదుగా బహుమతులు అందజెశారు ప్రధమ బహుమతి బొదిరెడ్డి వెంకటలక్ష్మికి గ్రైండరును బస్సా ప్రసాద్ బహుకరించగా,ద్వితీయ బహుమతి కర్రి భవానికి మిక్సీని మైరాల కనకారవు, బహుకరించారు.తృతీయ బహుమతి ఉగ్గిరాల పార్వతకి రైస్ కుక్కరును గంగిరెడ్ల మణికంఠ,ఆకుల నానిలు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రామాలలో సాంప్రదాయ సంక్రాంతి జరుపుకోవాలని అన్నారు.ఈ ముగ్గుల పోటీలు ద్వారా మహిళలు చిన్నారులు మరింత ఉత్తేజంగా సంక్రాంతి వాతావరణం తీసుకొచ్చారని ఈ సందర్భంగా అన్నారు.ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణయేతగా సుహాసిని వ్యవహారించారు. ఈ కార్యక్రమంలో తోట హరి,రామిశెట్టి బాబీ,కేలంగి సత్తిబాబు. పలువురు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు…