

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: స్పార్క్ సంస్థ సైబర్ ప్రో లాక్ రూరల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టును ప్రత్తిపాడు ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభా శుక్రవారం ఆవిష్కరించారు. స్పార్క్ సంస్థ అధ్యక్షులు సాయి సందీప్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై గ్రామస్థాయి నుండి అవగాహన కలిగి ఉండాలని ఈ ఇన్ఫో వెషన్ ప్రాజెక్టు చేపట్టడం జరుగుతుందని, ఈ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో ప్రత్తిపాడు నియోజకవర్గం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దీని ద్వారా గ్రామస్థాయి నుండి సైబర్ నేరాలను అరికట్టే అవకాశం ఉందని సాయి సందీప్ అన్నారు ఈ ఆవిష్కరణకు స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సాయి సందీప్, సీఈఓ ప్రదీప్, మరియు అడ్వైజర్ డాక్టర్ విజయ్ బాబు పాల్గొన్నారు.