

మన న్యూస్,రేణిగుంట: రేణిగుంట ఇదేం కర్మ సార్ అంతే నేను చెప్పిందే శాసనం సచివాలయ ఉద్యోగుల ను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ.
మండలంలో దొమ్మారం రేపుతున్న ఉద్యోగుల అంతర్గత బదిలీలు ఎవరికి భయపడను. సచివాలయం పరిధిలో ఉద్యోగుల బదిలీలు చేస్తూ బుధవారం ఎంపీడీవో దేవరకొండ విష్ణు చిరంజీవి ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో సచివాలయం ఉద్యోగులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు బదిలీల కారణం ఏమిటో అర్థం కావడం లేదు.నేను బదిలీలు చేస్తున్నాను మీరు సంతకం పెట్టండి.లేదంటే మిమ్మల్ని కలెక్టర్ కార్యాలయానికి సరెండర్ చేస్తానని ఎంపీడీవో బెదిరిస్తున్నట్లు కొంతమంది వాపోయారు.ఎంపీడీవో తనపై రాజకీయ ఒత్తిళ్లు చేయిస్తే సహించేది లేదని ,ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యులు అవుతారని ఏక వచనముతో బెదిరింపులకు గురి చేస్తున్నారు.. దీంతో రేణిగుంట సచివాలయ ఉద్యోగుల్లో భయం పట్టుకున్నది. ఏమి చేయాలో తోచక తమలో తాము నలిగిపోతున్నారు. కొందరు ఉద్యోగులు అయితే తీవ్ర మనస్థాపానికి గురై కంటతడి పెట్టుకుంటున్నారు. గత నెల రోజులుగా సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం పలు సర్వేలను వారితో చేయిస్తున్నది. రేణిగుంట నాలుగవ సచివాలయం,ఉద్యోగులను కొంతమందిని రేణిగుంట ఐదవ సచివాలయానికి అంతర్గత బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సచివాలయ ఉద్యోగులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మండల నాయకులు తో పాటు జిల్లా కలెక్టర్ ను కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎక్కడైనా ఉద్యోగులు విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారికి శిక్షతోపాటు కొన్ని ప్రయోజనాలను అధికారులు నిలిపివేయడం జరిగే సాధారణ ప్రక్రియ. అయితే ఇక్కడ మాత్రం అవినీతి అక్రమాలకు పాల్పడే ఉద్యోగులకు వంత పాడడం నిజాయితీగా తమ విధులను నిర్వహిస్తున్న ఉద్యోగులకు మాత్రం మొండి చేయి చూపిస్తూ అధికారం లేకపోయినా అంతర్గత బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రేణిగుంట 4వ సచివాలయంలో ఉద్యోగుల పనితీరు పట్ల ఆగ్రహించిన ఎంపీడీవో వారిని బదిలీ చేయడం జరిగింది. దీనిని కారణంగా చూపించి రేణిగుంట 5 సచివాలయం నుంచి రేణిగుంట4వ కు బదిలీలు చేస్తూ జారీ చేయడం పట్ల మండలంలో పెద్ద దుమారం రేపింది. ఎంపీడీవో ఇలా చేయడం ఏంటని మొరపెట్టుకుంటే నేను చెప్పింది చేయండి. నేను మండలానికి బాస్.. నేను చెప్పింది వినాల్సిందే అని సచివాలయం ఉద్యోగులపై విరుచుకుపడుతూ నేను చెప్పింది వినకపోతే ఆ తర్వాత పరిణామాలు వేరే విధంగా ఉంటాయని ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.సంతకం పెట్టి ఆర్డర్స్ తీసుకోండి
సంతకం పెట్టి ఆర్డర్స్ తీసుకోవాలని ఎంపీడీవో సచివాలయ ఉద్యోగులను హుకుం జారీ చేశారు. ఈ హఠాత్ పరిణామానికి మహిళఉద్యోగులు కన్నీటి పర్యంతం నేను ఏం చెప్తే తూచా తప్పకుండా నా ఆదేశాలు పాటించాలని ఆగ్రహంతో ఊగిపోయారు. నేను మండలానికి బాస్ అంతర్గత బదిలీల విషయంపై నాతో మాట్లాడాల్సిన అవసరం లేదని మహిళా ఉద్యోగి మొహంపై చెప్పడంతో ఏమి చేయాలో తోచక ఎంపీడీవో కార్యాలయం నుంచి తిరుగు పయానమయ్యారు. తమ గోడును జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి అక్రమ బదిలీల్లో రద్దు చేయాలని వ్యాఖ్యానించారు.