

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:మండలంలోని ఎర్రవరం,పెద్దనాపల్లి గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని రెండు రోజులపాటు మండల వ్యవసాయ అధికారిని బి.జ్యోతి నిర్వహించారు.ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ నేషనల్ పెస్ట్ సర్వ్ లెన్సెస్ సిస్టమ్(ఎన్ పి ఎస్ ఎస్)యాప్ నందు ప్రతి ఒక్క రైతు రిజిస్ట్రేషన్ చేసుకుని తమ పొలంలో ఉన్న పురుగు,తెగుళ్ల వివరాలను ఫోటో తీసి అప్లోడ్ చేయడం ద్వారా మార్గాలు తెలుసుకోవచ్చునని తెలిపారు.పిఎండిఎస్ విత్తనాల సాగు ద్వారా భూసారాన్ని పెంచవచ్చునని తద్వారా పంటకు అన్ని రకాల పోషకాలు అందుతాయని ఆమె తెలిపారు.అంతేకాకుండా జీవన ఎరువులు అజో స్పైర్లం,రైజోబియం,పాస్కో బ్యాక్టీరియాల వినియోగం ద్వారా చాలావరకు ఎరువుల వాడకం తగ్గడంతో పాటు నాణ్యమైన పంటను పండించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాశ్,సుంకర సత్యనారాయణ,గ్రామ నాయకులు బసా మహాలక్ష్మి ప్రసాద్,మైరాల కనకారావు,ఉగ్గిన సతీష్,ఉద్యానవన సహాయకులు,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది,గ్రామ పెద్దలు,రైతులు పాల్గొన్నారు.