

మన న్యూస్,గద్వాల,జిల్లా: జోగులాంబగద్వాల జిల్లా కేటి దొడ్డి మండల పరిధిలోని ఎలాంటి అనుమతులు లేకుండాగా.కర్ణాటక నుంచి వచ్చి వ్యాపారస్తులు తెలంగాణ రాష్ట్రంలో యదేచ్చగా చెట్లు నరికి అక్రమంగా ట్రాక్టర్ల తో కర్ణాటక రాష్ట్రానికి. రాయచూర్ జిల్లాకు తరలిస్తున్నారు. పర్యవరణాన్ని కాపాడాల్సిన వాళ్లే చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నారు జిల్లా ఫారెస్ట్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక కంప్యూటర్ ఆపరేటర్ అండదండతో వ్యాపారస్తులతో కుమ్మకై పై అధికారులకు తెలియకుండా ఈదందా నడుపుతున్నారంటూ.ప్రజల్లోపల గుసగుస వినిపిస్తున్నాయి. ఆపరేటర్ గా పనిచేయాల్సింది పోయి. వ్యాపారాసులు ఇచ్చే పైసలకి అలవాటపడ్డాడు. ఫారెస్ట్ రేంజ్ అధికారులకి ట్రాక్టర్లు దొరికినప్పుడు ఏదైనా సమాచారం కోసము .ఫారెస్ట్ ఆఫీస్ కి ఎవరైనా వెళ్ళితే ఆఫీస్ కి వచ్చిన వాళ్లను .ఫోటో తీసి మీ ట్రాక్టర్లును అధికారులకు సమాచారం ఇచ్చి వీళ్లే పట్టించారని .వ్యాపారస్తులకు ఫోటో తీసి పంపుతుంటాడు. ఇలాంటి వారిపై ఉన్నత అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు