జూద క్రీడలు వద్దు.. సంక్రాంతి సంబరాలే ముద్దు..పోలీసుల వినూత్న కార్యక్రమం

(మన న్యూస్ ప్రతినిధి )ఏలేశ్వరం : జూద క్రీడలు వద్దు సంక్రాంతి సంబరాలే ముద్దు అని ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సూర్య అప్పారావు పిలుపునిచ్చారు.స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆట స్థల ప్రాంగణంలో సీఐ సంక్రాంతి క్రీడలు మంగళవారం ప్రారంభించారు. ఈ మేరకు వాలీబాల్ టీం ల సభ్యులతో కరచాలనం చేసి క్రీడా మైదానాన్ని రిబ్బన్ కట్ చేసి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు.స్థానిక ఎన్డీఏ శ్రేణులు ఎస్సై,సీఐలు రెండు టీములుగా ఏర్పడి వాలీబాల్ ఆటలొ పాల్గొని యువకులతో స్నేహభావంతో ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పరిచారు.తొలత క్రీడా ప్రాంగణంలో యువకులను ఉద్దేశిస్తూ సీఏ అప్పారావు మాట్లాడుతూ యువకులు ఎట్టి పరిస్థితుల్లోనూ జూద క్రీడలు ఆడరాదని అవి శిక్షా అర్హమైనవని అన్నారు.కోడిపందాలు, పేకాట,గుండాట సంబరాల పేరిట అశ్లీల నృత్య ప్రదర్శనలు చేస్తే అట్టివారిపైనా,నిర్వాహకుల పైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సాంప్రదాయ బద్ధమైన వాలీబాల్, క్రికెట్,కబాడి వంటి సంప్రదాయమైన క్రీడలు యువత ఆడాలన్నారు. యువత ముగ్గుల పోటీలను ప్రోత్సహించాలన్నారు. సకుటుంబ పరివారంతో సంక్రాంతి ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ సంక్రాంతి సంబరాల్లో ఏలేశ్వరం ఎస్సై ఎన్.రామలింగేశ్వరరావు,మాజీ జడ్పిటిసి జ్యోతుల పెదబాబు,నగర పంచాయతీ కౌన్సిలర్లు బొద్దిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి,ఎండగుండి నాగబాబు,పి.శ్రీను,కోణాల వెంకటరమణ,ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ కో జొన్నాడ వీరబాబు, కర్రోతు గాంధీ,పెంటకోట శ్రీధర్,షెక్ ఇమ్రాన్,పోలీస్ సిబ్బంది మాణిక్యం, సత్తిబాబు,రామకృష్ణ,పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..