రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వైసీపీ,రెండు, మూడు,నెలల్లో మహిళలకు ఉచిత బస్సు

మనన్యూస్,పాచిపెంట:100 రోజుల్లో 100 రోడ్లు ప్రారంభించాం రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని రాష్ట్ర గిరిజన శాఖ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహం చెందారు. గతంలో ఐదు లక్షల మందికి దొంగ పెన్షన్లు పెట్టారని అటువంటివి ఇకపై జరగకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నాడు పాచిపెంట మండలం మంచాడవలస గ్రామంలో 11 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేపడుతున్నారని తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ కలసి త్రిమూర్తులు మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఆమె గర్వంగా చెప్పుకున్నారు. 300 కోట్ల రూపాయలు జిల్లాకు మంజూరు చేయగా సాలూరు నియోజకవర్గానికి 80 కోట్ల రూపాయలు తో రహదారుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వంద రోజుల్లో 100 రహదారులు నిర్మించి రికార్డు సృష్టించామని ఆమె పేర్కొన్నారు.పాచి పెంట మండలంలో 27 పనులు పూర్తిగా గాక మరో 27 వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. గతంలో రహదారులు చూస్తే గుంతలు తప్ప రహదారులు కనబడేవి కాదని, దానివలన ముఖ్యమంత్రి కి తాము తెలియజేయగా ఆయన తక్షణమే స్పందించి రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని తెలిపారు. ప్రధానంగా గిరిజన గ్రామాల్లో డోలిమోతలకు స్వస్తి పలకాలని, రహదారులు నిర్మిస్తే డోలీమోతలు అవసరం ఉండదని తెలిపారు. ప్రజలు సురక్ష జీవనం కూటమి సర్కారు హామీ అని బహిరంగంగా తెలియజేశారు. మారుముల ప్రాంతాల్లో నీటి సౌకర్యము, పక్కా గృహాలు నిర్మాణం, అర్హులైన వారికి పెన్షన్లు,అందజేయడమే కూటమి ప్రభుత్వము లక్ష్యమని తెలిపారు. నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందజేయడం ఇది ఒక చరిత్రని, అది కూటమి ప్రభుత్వానికే సాధ్యమని పేర్కొన్నారు. గతంలో గిరిజన ప్రాంతాల్లో రుణ సౌకర్యం లేకుండా గత ప్రభుత్వం గిరిజన ప్రజలను అన్యాయం చేసిందని, రానున్న రోజుల్లో మేకలు గేదెలు లోన్లు అందిస్తామని తెలిపారు. ఉద్యోగం రావాలంటే బాబు రావాలని నమ్మిన ప్రజలు నిజం చేశారని అందుకే డీఎస్సీ తీశారని తెలిపారు. రెండు మూడు నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యము మహిళలకు అందిస్తామని తెలిపారు.వచ్చే విద్యా సంవత్సరానికి పిల్లలకు అమ్మకు వందనం సంక్షేమ పథకం అమలు చేస్తామన్నారు. ప్రతి మనలో సోమవారం గ్రీవెన్స్ పెట్టుకుందామని వెల్లడించారు. విశాఖ మహాసభకు ప్రధాన మంత్రి మోడీ హాజరైతే మూడు లక్షల మంది అభిమానులు వస్తున్నారని వెల్లడించారు.తాను మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో 20 మంది గిరిజన ఉపాధ్యాయులు పోస్టులను భర్తీ చేశామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె అక్కడికి విచ్చేసిన పాచిపెంట ప్రజలకు మాట్లాడుతూ పాచిపెంట పేరు ను మార్చి పసిడి పంట గా మారుద్దామని ప్రతిపాదించారు.ఆమె మాటలకు సభదద్దరిల్లి పోయింది. అందరూ అంగీకరించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ సావిత్రి, పాంచాలి, కనక రాజు,పి నరసింగరావు సర్పంచ్ యుగంధర్,ఎంపీటీసీ ఉమా తదితరులు హాజరయ్యారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..