ఆర్ హెచ్ వి ఎస్ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా డాక్టర్ అరుణ

మన న్యూస్,తిరుపతి: రేపు శ్రీశైలంలో ఆధ్యాత్మిక సదస్సు19న డెహ్రాడూన్ లో హైందవ సభ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆర్ హెచ్ వి ఎస్ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గా డాక్టర్ అరుణను నియమించి నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి,రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజు,మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవిరాజు,రాష్ట్ర యువ మహిళ అధ్యక్షురాలు సంగరాజు అశ్విని వర్మ తెలిపారు.ఈ మేరకు నియామక పత్రాన్ని సోమవారం డాక్టర్ అరుణకు అందజేశారు.ఈ సందర్భంగా సుకుమార్ రాజు మాట్లాడుతూ అయోధ్య ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ముఖ్య సంరక్షకులు మహంతు వైదేహి వల్లభ శరన్ దాస్ మహారాజ్, జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర ద్వివేది రాజు భయ్యా,జాతీయ ప్రధాన కార్యదర్శి నవీన్ చంద్ర శుక్ల లచే నియామకం జరిగినట్లు పేర్కొన్నారు.హిందూ సామ్రాజ్యం లో రామరాజ్య స్థాపన కోసం, సనాతన హైందవ ధర్మాన్ని,ఆధ్యాత్మిక భావాలను క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరాలనే దృఢ సంకల్పంతో శ్రీవారి పాదాల చెంత తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్రను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.పార్టీలకు అతీతంగా రామ రాజ్య స్థాపనే ఎజెండాగా ఏర్పాటైన ఆర్ హెచ్ వి ఎస్ వేగవంతంగా అడుగులు వేస్తోందన్నారు.మార్చిలో తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్ర ప్రారంభమై అయోధ్య వరకు కొనసాగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూపీ ముఖ్యమంత్రివర్యులు యోగి ఆదిత్యనాథ్ లతోపాటు శ్రీలంక,మారిషస్ ప్రధానులు ఇతర ప్రముఖులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.ఈ విషయంగా జనవరి 8న అనగా రేపు శ్రీశైలంలో,19న డెహ్రాడూన్ లో ఆధ్యాత్మిక సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఆర్ హెచ్ వి ఎస్ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ అరుణ మాట్లాడుతూ హైందవ ధర్మం కోసం,ఆధ్యాత్మిక చింతన కోసం, శ్రీరామ రాజ్య స్థాపన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ మహా యజ్ఞంలో తనకు భాగస్వామ్యం కలగడం దైవ సంకల్పంగా భావిస్తూ తన వంతు శక్తివంచన లేకుండా ఆర్ హెచ్ వి ఎస్ అభివృద్ధికి, ఆధ్యాత్మిక వ్యాప్తికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువ మహిళా విభాగం శ్రీరామ సేవకులను అతి త్వరలో నియమించనున్నట్లు అశ్విని తెలిపారు.తనకు ఈ బాధ్యత అప్పగించినందుకు జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ చంద్ర ద్వివేది రాజు భయ్యా, నవీన్ చంద్ర శుక్ల,దక్షిణ భారతదేశ బాధ్యులు కృష్ణ కిషోర్,ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజు,మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవి రాజు, అశ్వినీ వర్మ ఉపాధ్యక్షులు సిరిగిరి శంకర్ రాజు, వీరనాగ మల్లయ్య, వెంకటేశ్వర్లు రాజులకు అభినందనలు తెలియజేశారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి