

మన న్యూస్,హైదరాబాద్,
(చార్మినార్) ఏరియాలోని ఖాజా షౌక్ మీటింగ్ హాల్, చౌమొహల్లా ప్యాలెస్ ఎదురుగా, మోతిగల్లి, ఖిల్వత్ ఉర్దూ ముస్కాన్ సాలర్ ఈ మిల్లట్ మెమోరియల్ ఆడిటోరియంలో జరిగిన టిజేఏ ఐ కి అనుబంధంగా ఉన్న తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ టిజేఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి
చార్మినార్ ఎమ్యెల్యే జుల్ ఫెకార్ అలీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ…జర్నలిస్టుల కు కుల, మత, భేదాలు లేవని,సమాజాభివృద్ధికి పాటుపడుతున్నారు జర్నలిస్ట్ లకు ఎప్పుడు తన వంతు సహకారం ఉంటుందన్నారు. పేద ఎమ్యెల్యేగా తనకు జర్నలిస్ట్ సమస్యలు బాగా తెలుసని అన్నారు. జర్నలిస్టుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సి దిలీప్ కుమార్, టీడీపీ రాష్ట్ర స్పోక్స్ మెన్, ఈ కార్యక్రమంలో టీజేఏ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్, టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు రమణ రావు, టీజేఏ వర్కింగ్ ప్రెసిడెంట్ వి.రాజేందర్ నాథ్, టీజేఏ ప్రతినిధులు, ఖాసీం, ఖాలీల్ అహ్మద్, గౌరీ, చింతల నీలకంఠంతో, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డితో పాటు రాష్ట్రంలోని జిల్లాలు, మండలాల నుండి టీజేఏ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.సమావేశంలో చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.