

మన న్యూస్,పాచిపెంట: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కర్రి వలస వెళ్లే దారిలో విద్యార్థులకు రైతులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న కల్వర్టు నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు పడాల మోహన్ ఎస్ గోపాల్ గెద్ద కూర్మయ్య లతో కలిసి సిపిఎం జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు పత్రికా విలేకరులతో మాట్లాడారు.కల్వర్టు నిర్మాణం లేకపోవడం వలన కారి గడ్డ వద్ద కూరుకుపోయిన లారీ వద్ద వారు మాట్లాడుతూ.ఈ కల్వర్టు నిర్మాణం లేకపోవడం వలన నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహించి నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న కల్వర్టు నిర్మాణం చేపట్టే ప్రజలకు ఆదుకోవాలని ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలకు రక్షణ కల్పించాలని అన్నారు కల్వర్టు లేకపోవడం వలన విద్యార్థులు సాలూరు వెళ్లాలన్న పాచిపెంట వెళ్లాలన్న మహిళలు రైతులు వ్యవసాయ పనులకు వెళ్లాలన్న ఇదే దారి గుండా వెళ్లాల్సిన పరిస్థితి కనుక యుద్ధ ప్రాతిపదికన కల్వర్టు నిర్మాణం పనులు వేగవంతం చేసి ఆదుకోవాలని కోరారు. పాచి పెంట మండలం.కర్రివలస వెళ్లే రహదారి లో కారి గడ్డ వద్ద.కోరుకుపోయినా లారీని చూపిస్తున్న గ్రామస్తులు సిపిఎం నాయకుడు కోరాడ ఈశ్వరరావు.