

వెదురుకుప్పం మన న్యూస్ :- వెదురుకుప్పం మండలానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిఎన్ఆర్ కండిగ మాజీ ఉపసర్పంచ్ సుబ్రహ్మణ్యం తల్లి రంగమ్మ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైయస్సార్సీపి నియోజవర్గ సీనియర్ నాయకులు హరికృష్ణ. వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి పేట ధనంజయ రెడ్డి శుక్రవారం గ్రామానికి చేరుకుని రంగమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి పేట ధనంజయ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గురావారెడ్డి, , నాయకులు నరసింహారెడ్డి, సుబ్రమణ్యం,గురు స్వామి, వడివేలు, పరమేశ్వర రెడ్డి, రామ చంద్రయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.