

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామ శివారులో నిర్మించిన అవంతి ఫ్రొజెన్ ఫుడ్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన జామి మహాలక్ష్మి అనే మహిళ గురువారం మృతి చెందింది.అవంతి ఫ్యాక్టరీలో మహాలక్ష్మి పని చేస్తున్న సమయంలో కంపెనీలో కింద పడిపోవడంతో తలకి బలమైన గాయమైందని, కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని బంధువులు, తోటి కార్మికులు కంపెనీ వద్ద మహాలక్ష్మి మృతదేహంతో నిరసనకు దిగారు.బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అంటూ కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు కంపెనీ వద్ద దాదాపు10 గంటలు నిరసన.కొనసాగిన కొనసాగించారు నిరసన అనంతరం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కంపెనీ యాజమాన్యం,కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించారు.బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం పై ఉందని ఎమ్మెల్యే సత్య ప్రభ గట్టిగా చెప్పడంతో కంపెనీ యాజమాన్యం దిగి వచ్చింది.ఎమ్మెల్యే సత్యప్రభ కృషితో బాధిత కుటుంబానికి 13 లక్షల రూపాయల నష్టపరిహారం,మృతురాలి భర్తకి కంపెనీలో ఉద్యోగం, పిల్లలకు చదువుకు నెలకి 6000 ఆర్థిక సహాయం చేయడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది ఆని ఏలేశ్వరం మండల ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మీడియాకు తెలిపారు.బాధిత కుటుంబానికి న్యాయం జరగడంతో కుటుంబ సభ్యులు,ఏలూరు గ్రామస్తులు, ఇతర కార్మికులు, ఎమ్మెల్యే సత్య ప్రభకు కృతజ్ఞతలు తెలియజేశారు.