
మన న్యూస్,తిరుపతి,నూతన సంవత్సరంలో శ్రీవారి ఆశిశ్శులు తిరుపతి నియోజకవర్గ ప్రజందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం ఉదయం ఎమ్మెల్యే నివాసం శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రజలతో సందడిగా మారింది.ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి,టిడిపి నగర ప్రధాన కార్యదర్శి నైనార్ మహేష్ యాదవ్,ఎన్డీఏ కూటమి నేతలు,జనసేన నాయకులు,వీరమహిళలు,ప్రజలు,వివిధ శాఖలకు చెందిన అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.గంగమ్మ గుడి ఆలయ పూజారులు ఎమ్మెల్యేని ఆశ్వీరదించారు.అభివృద్ధి,సంక్షేమం రెండిటిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు రాష్ట్రాభివృద్ధికి చేపట్టే అన్ని చర్యలు విజయవంతం కావాలని శ్రీవేంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.రాష్ట్ర అభివృద్ధితోపాటు తిరుపతి నియోజకవర్గం ఈ నూతన సంవత్సరంలో మరింత అభివృద్ధి చెందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.