

మనన్యూస్:తిరుపతి జిల్లాశ్రీకాళహస్తి సంఘ సేవకులు,డాక్టర్ యల్లంపాటి కోటేశ్వరబాబు మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు.శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో ఉన్న యాచకులు,సాధువులు నిరాశ్రయులకు 55మందికి ఆయన మంగళవారం దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా యల్లంపాటి కోటేశ్వరబాబు మాట్లాడుతూ… శీతాకాలం ఆరంభమైనందున ముక్కంటి ఆలయ పరిసరాల్లో యాచకులు,సాధువులు నిరాశ్రయులు చలికి అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.వారి బాధలను కనులారా చూడటంతో తన మనసు చలించి పోయిందన్నారు.ఉడతా భక్తిగా యాచకులు, సాధువులకు నిరాశ్రయులకు తనవంతు సాయం చేయాలనే కోరికతో ఈ దుప్పట్లు అందచేస్తున్నట్లు కోటేశ్వరబాబు చెప్పారు.తాను చాలా కాలంగా పేదలకు సేవ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.భవిష్యత్తులో కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని డాక్టర్ యల్లంపాటి కోటేశ్వరబాబు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆయన మిత్రులు పాల్గొన్నారు.