

మనన్యూస్:తిరుపతి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తిరుపతికి చెందిన వేలూరు జగన్నాథం నియమించారు.ఈ సందర్భంగా ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా బీసీలందరినీ ఐక్యంగా కూడగట్టుకుని వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.తనకు ఈ పదవి రావడానికి సహకరించిన బీసీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణయ్య రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు తెలంగాణ ఏపీ బీసీ జాతీయ నేతలకు జగన్నాథం కృతజ్ఞతలు తెలిపారు.జనవరి1న జాతీయ బీసీ సంక్షేమ సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించినట్టు పేర్కొన్నారు.ఈ విలేకరుల సమావేశంలో జిల్లాకు చెందిన బిసి సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.