

బంగారుపాళ్యం,డిసెంబర్ 28 మన న్యూస్
బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలీశ్వర స్వామి ఆలయం నందు పార్కింగ్ గేట్ వసూలు చేయుట,టెంకాయలు,పూజ సామగ్రి అమ్ముకొనుట, పాదరక్షలు భద్రపరచుట, కొబ్బరి చిప్పలు పోగు చేయుట,తలనీలాలు పోగు చేయుట మొదలగు హక్కులకు శనివారం ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఎం.బి.విజయకుమార్ ఆధ్వర్యంలో బహిరంగ వేలము పాటలు నిర్వహించడం జరిగింది. ఈవేళము పాటలలో తలనీలాలు3,40,000 రూపాయలతో హెచ్చు పాటదారుగా నిలిచారు. అలాగే మొగిలి గ్రామానికి చెందిన నటరాజ పార్కింగ్ గేటు 85000 రూపాయలు, ఆనంద కొబ్బరి చిప్పలు పోగుచేయుట 37600 రూపాయలు,మొగిలివారి పల్లికి చెందిన రాకేష్ పాదరక్షలు భద్రపరచుట 28500 రూపాయలతో హెచ్చు పాటదారులుగా నిలిచారు. మొత్తం వేలం పాటల ద్వారా ఆలయానికి 4,91,600 రూపాయలు ఆదాయం లభించినట్లు ఆలయ ధర్మకర్త విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మునిరాజా, క్లర్క్ ఎల్.శరవణ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.