

మన న్యూస్:హయత్ నగర్ డివిజన్ లోని అరుణోదయ కాలనీలో భూగర్భ డ్రైనేజ్ మాన్ హోల్స్ చెత్తాచెదారంతో నిండడం వల్ల తరచు మాన్ హోల్స్ పొంగి దూర్వసతో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారని సమాచారం రావడంతో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి సంబంధిత సిబ్బందితో కలిసి భూగర్భ డ్రైనేజ్ మాన్ హోల్స్ పరిశీలించారు.ఈ సందర్భంగా వారు కాలనీవాసులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వెంటనే భూగర్భ డ్రైనేజ్ మాన్ హోల్స్ శుభ్రం చైయాలని HMWS&SB సూపర్వైజర్ బాలు నాయక్ కి తెలపడం జరిగింది.ఈ యొక్క పరిశీలనలో అరుణోదయ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.