

మనన్యూస్:ఏలేశ్వరం మండల పరిసరాల్లోని ఏలేరు నది నుంచి కొల్లగొడుతున్న ఇసుకను అక్రమార్కులు తమకు అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. నదుల్లో ఇసుకను తీసి నిల్వ చేసిన ఇసుకను డిమాండును బట్టి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టరు దొడ్డు ఇసుక రూ.3,000,మధ్య రకం ఇసుకు రూ.4,000, సన్నరకం ఇసుక రూ.5,000 చొప్పున విక్రయిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ, గనుల శాఖ అధికారుల తనిఖీలు లేక పోవడంతో ఏలేశ్వరం మండలంలో సాఫీగా సాగి పోతోంది. ప్రస్తుత వేసవిలో ఇసుక తవ్వకాలకు నదులు అనుకూలంగా ఉన్నాయి. దీంతో అక్రమార్కులు రాత్రివేళ తవ్వకాలు జరిపి నిర్ణీత ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు.పట్టణ శివార్లతో పాటు నదీ పరివాహక గ్రామాల్లో ఇసుక నిల్వలు విరివిగా కనిపిస్తున్నాయి. పరివాకంగా భూగర్భ జల మట్టం పడిపోకుండా ఉండాలంటే అధికారులు ఇసుక తవ్వకాలను నివారించాలని, నదుల పరివాహక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.