

మనన్యూస్:కామారెడ్డి పట్టణంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేయాలంటే భయపడుతున్న వైనం.ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్స్ షాప్లో స్టిల్స్ పాత్రలు తోమే స్టీల్ స్క్రబ్బర్ స్వీట్ ముక్కలలో వచ్చిన వైనం పట్టించుకోని ఫుడ్ ఇన్స్పెక్టర్స్ నామమాత్రంగా తనిఖీలు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫోనే చేస్తే అందుబాటులోని వైనం,ఫోన్ లో మాట్లాడితే మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే రాతపూర్వకంగా ఇవ్వాలని జర్నలిస్టులకు హుకుం జారీ చేస్తున్నా అధికారులు,కామారెడ్డి పట్టణంలో ఇంత జరుగుతున్న తనిఖీలు చేయకపోవడం ద్వారానే ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని బాధితులు ఆవేదన, ఢిల్లీ వాళ స్వీట్స్ షాప్ లో స్వీట్స్ తీసుకెళ్లి ఇంటికి వెళ్లి స్వీట్ బాక్స్ తీసి చూస్తే స్వీట్ లలో స్టిల్స్ స్క్రబ్బర్స్ రావడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ముందుగా చిన్న పిల్లలు తిని ఉంటే చిన్నపిల్లలు చనిపోయే పరిస్థితి ఉండేదని ముఖ్యంగా చెప్పాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తనకి లేకపోవడం ద్వారానే ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇలాంటి ఢిల్లీ వాల స్వీట్స్ షాపును వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు అసలు కామారెడ్డిలో స్వీట్ షాప్ పెట్టాలంటే నిబంధనలకు అతీతంగా స్వీట్ షాప్స్ పెడుతున్నారు కానీ షాపులను తనిఖీ చేయడంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు నిర్లక్ష్యం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు అందుకే ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి ఇట్టి విషయం పైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి వెంటనే ఒక సీట్ హోమ్ షాప్ కాకుండా అన్ని హోటల్ను కూడా తనకి చేయాలని కోరుకుంటున్నారు.