

మన న్యూస్:ప్రత్తిపాడు తుని నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న8ఎద్దులను పట్టుకుని ఆ వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మికాంతం తెలిపారు.పోలీసు వాహనాన్ని చూసి రాచపల్లి గ్రామం వైపు బొలెరో వాహనాన్ని అతి వేగంతో నడుపుతుండగా పట్టుకుని మండలంలో గల ఉలిగోగుల గోశాలకు ఎద్దులను తరలించినట్లు ఎస్సై ఎస్.లక్ష్మికాంతం గారు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోవులను, ఎద్దులను, గేదెలను నిర్బంధించి అక్రమంగా తరలించినట్లయితే అట్టి వారిపై చట్ట పరమైన చర్యలు తీసికొంటామని ఎస్సై లక్ష్మికాంతం గారు హెచ్చరించారు.