

మన న్యూస్:తిరుపతి నగరంలోని కేబి లేఅవుట్ లో ఉన్న షెకీనా మినిస్ట్రీస్ చర్చ్, వెస్ట్ చర్చ్ లలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. ఎమ్మెల్యేని చర్చి పాస్టర్స్ దీవించారు. జీసస్ చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన కోరారు. అసూయ, ద్వేషాన్ని వీడి ప్రజలు సామరస్యంగా జీవించాలని ఆయన విజ్జప్తి చేశారు. తిరుపతి నియోజకవర్గం ప్రజలపై జీసస్ ఆశీశ్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నలభైఏళ్ళ రాజకీయ జీవితంలో క్రిస్టియన్ ల పాత్ర ఎనలేనిదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాస్టర్ లకు గౌరవ వేతనాన్ని అందించి గౌరవిస్తోందని ఆయన తెలిపారు. ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా చర్చల నిర్మాణం, పునరుద్దరణకు ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు క్రిస్టయన్ ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని ఆయన తెలిపారు. కాగా జరూసలేం యాత్రకు వెల్ళేవారికి ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాల్లో టిడిపి నాయకురాలు, ఎస్సీ కార్పోరేషన్ డైరక్టర్ కుమారమ్మ, మురళీనాథ్ రెడ్డి, జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి, చందు, వెంకటేశ్, మునస్వామి, ఆముదాల వెంకటేష్, ఆళ్వార్ మురళీ, వినోద్ రాయల్ , వన్నికుల క్షత్రియ కార్పోరేషన్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యం అయ్యంగార్, జానకి రామ్, శివ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.